నేటి నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న 'దండోరా' !
సా మాజిక అంశాలపై ఆసక్తి ఉన్న ప్రేక్షకులకు గ్రామీణ కథలను ఇష్టపడేవారికి 'దండోరా' ఒక మంచి సినిమాటిక్ అనుభవాన్ని అందిస్తుందని చెప్పొచ్చు. థియేటర్లలో మిస్ అయిన వారు ఇప్పుడు ఓటీటీలో ఈ సినిమాను చూసే మంచి అవకాశం లభించింది. ఇది నేటి నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. 'దండోరా' థియేటర్ విజయం తర్వాత ఓటీటీ వేదికపై కూడా మంచి స్పందన రాబట్టే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ టైమ్‌లో మెదక్ దగ్గర తుళ్లూరు అనే గ్రామంలో ఈ కథ సాగుతుంది. ఈ గ్రామంలో కుల వివక్ష బలంగా ఉంటుంది. అణచి వేయబడిన కులానికి చెందిన వ్యక్తి మరణిస్తే ఊరి స్మశానంలో కాకుండా ఊరి చివర దహనం చేయడం అక్కడి ఆనవాయితీ. అలాంటి గ్రామంలో అగ్రకులానికి చెందిన శివాజీ మరణిస్తాడు. కానీ అతడి శవాన్ని ఊరి శ్మశానంలో దహనం చేయడానికి కుల పెద్దలు నిరాకరిస్తారు. "శివాజీని మా కులం బహిష్కరించింది" అంటూ సంచలన నిర్ణయం తీసుకుంటారు. అసలు అగ్రకులానికి చెందిన శివాజీని అతడి కులమే ఎందుకు వెలివేసింది? అతడి గతంలో ఏం జరిగింది? అన్న ప్రశ్నలతో కథ మొదలవుతుంది. శివాజీకి కొడుకు విష్ణు, కూతురు సుజాత ఉంట...