Posts

Showing posts with the label multi-pronged strategy such as technological innovations

సబ్ సీలో కేబుల్ నెట్ వర్క్ కీలకం : ట్రాయ్ చైర్మన్ అనిల్ కుమార్ లహోటీ

Image
ఏఐ యుగంలో డిజిటల్ లక్ష్యాల సాధనకు సబ్ సీ (సముద్ర అంతర్భాగం)లో కేబుల్ నెట్ వర్క్ కీలకమైందని ట్రాయ్ చైర్మన్ అనిల్ కుమార్ లహోటీ తెలిపారు. అయితే ప్రకృతి విపత్తులు, భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు, డేటాకి డిమాండ్‌ మొదలైన వాటి వల్ల తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్న సబ్‌మెరైన్‌ కేబుల్‌ వ్యవస్థల భద్రతకు మరింత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇందుకు సంబంధించిన సవాళ్లను పరిష్కరించేందుకు సాంకేతిక ఆవిష్కరణలు, నిర్వహణపరమైన సామర్థ్యాలను మెరుగుపర్చుకోవడం, విధానాలపరమైన చర్యల్లాంటి బహుముఖ వ్యూహం అవసరమని పేర్కొన్నారు. కేబుల్స్‌ వేసే మార్గాల ప్లానింగ్, రిస్కులు తక్కువగా ఉండే ప్రాంతాలను ఎంచుకోవడం, రియల్‌ టైమ్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌లను వినియోగించడంలాంటి అంశాలతో నష్టాలను నివారించవచ్చని బ్రాడ్‌బ్యాండ్‌ ఇండియా ఫోరం నిర్వహించిన సదస్సులో పాల్గొన్న సందర్భంగా లాహోటి చెప్పారు. సబ్‌మెరీన్‌ కేబుల్‌ వ్యవస్థ భద్రతను బలోపేతం చేసేందుకు అంతర్జాతీయ సహకారం, పటిష్టమైన నియంత్రణ విధానాలు అవసరమన్నారు. సబ్‌ సీ కేబుల్, డిజిటల్‌ క్లౌడ్‌ మౌలిక సదుపాయాలు డిజిటల్‌ ప్రపంచానికి, ఏఐ యుగానికి కీలకమైన ఇన్‌ఫ్రాగా మారాయని చెప్పారు. ఈ నేపథ్...