శ్రీకాకుళంలో డయేరియా : ముగ్గురు మృతి, 76 మందికి అస్వస్థత
ఆం ధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళంలో డయేరియాతో ముగ్గురు వ్యక్తులు మరణించారు. కండ్ర వీధికి చెందిన మండల సురేష్ (42) గత మూడు రోజులుగా వాంతులు, విరేచనాలతో బాధపడుతూ రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మంగువారి తోట, ద్వారకా నగర్ ప్రాంతానికి చెందిన సదాశివుని శేఖర్ (53) కూడా ఇదే లక్షణాలతో జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. కండ్ర వీధిలో ఇంకా చాలా మంది వాంతులు, విరోచనాలతో బాధపడుతున్నారని, పరిస్థితి ఆందోళనకరంగా ఉందని స్థానికులు వాపోతున్నారు. దీనికి ప్రధాన కారణం తాగునీరు కలుషితం కావడమేనని ప్రాథమికంగా నిర్ధారించారు. పట్టణ పరిధిలో జరుగుతున్న వివిధ మరమ్మతు పనుల కారణంగా భూగర్భ పైపులైన్లు పగిలిపోవడంతో, మురుగు నీరు తాగునీటిలో కలిసి కొళాయిల ద్వారా ఇళ్లకు సరఫరా అయింది. ఈ కలుషిత నీటిని తాగడం వల్లే ప్రజలు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు స్పందించి అధికారులతో ఆరా తీశారు. తక్షణమే పైపులైన్ ద్వారా నీటి సరఫరాను నిలిపివేసి, మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ట్యాంకర్ల ద్వారా సురక్షితమైన తాగునీటిని అందించేలా చర్యలు చేపట్టారు. పరిస్థితి తీవ్రత...