Posts

Showing posts with the label itel Aqua Feature Phone Launched

ఐటెల్ ఆక్వా ఫీచర్ ఫోన్‌ విడుదల

Image
దే శీయ మార్కెట్లోకి సరికొత్త ఫీచర్ ఫోన్‌ 'ఐటెల్ ఆక్వా' విడుదల అయింది. నీరు, ధూళి నుండి రక్షణ కల్పించే ఐపీ67 రేటింగ్‌తో రావడం ఈ ఫోన్ అత్యంత ప్రత్యేకత. ఇంత తక్కువ ధరలో ఈ తరహా రక్షణ ఉన్న ఫోన్ రావడం మొబైల్ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఐటెల్ ఆక్వా ధరను కేవలం రూ. 1,799 గా కంపెనీ నిర్ణయించింది. ఈ ఫోన్ బ్లూ, రెడ్ , బ్లాక్ రంగులలో లభిస్తుంది. ప్రస్తుతం ఈ హ్యాండ్‌సెట్ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రముఖ రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌లో 2.4-అంగుళాల డిస్‌ప్లేను అందించారు. ఎండలో లేదా బయట తిరిగేటప్పుడు కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా మెరుగైన బ్రైట్‌నెస్ లెవెల్స్‌తో దీనిని డిజైన్ చేశారు. ఈ ఫోన్ ప్రాసెసర్ , ర్యామ్ వివరాలను కంపెనీ అధికారికంగా వెల్లడించనప్పటికీ, మెమరీ కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను 32GB వరకు పెంచుకునే అవకాశాన్ని కల్పించింది. అంతేకాకుండా, ఇందులో ఐకాన్లతో కూడిన 1,000 కాంటాక్ట్ నంబర్లను, 250 మెసేజ్లను దాచుకోవచ్చు , 60 కాల్ లాగ్స్ హిస్టరీని భద్రపరుచుకోవచ్చు. ఫోటోల కోసం ఐటెల్ ఆక్వా వెనుక భాగంలో వీజీఏ కెమెరాను అమర్చారు. వాయిస్ కాల్స్ మాట్లాడేటప్పుడు చుట్ట...