ఆస్తుల రిజిస్ట్రేషన్‌లో జియో-ట్యాగింగ్ : భూ వివాదాలను పూర్తిగా అరికట్టడమే లక్ష్యం !
భూ ములు, ఇళ్ల కొనుగోలు, విక్రయాల సమయంలో దశాబ్దాలుగా వెంటాడుతున్న సరిహద్దు వివాదాల కు శాశ్వత పరిష్కారం చూపే దిశగా రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ ఒక విప్లవాత్మక అడుగులు వేసింది. ఆస్తుల నమోదు ప్రక్రియను మరింత పారదర్శకంగా మార్చేందుకు సేల్ డీడ్ పత్రాలతో పాటు ప్రాపర్టీ మ్యాప్‌లను, అక్షాంశ-రేఖాంశ వివరాలతో కూడిన జియో-ట్యాగింగ్ టాను జతచేసే విధానాన్ని వేగవంతం చేసింది. కొత్తగా రిజిస్ట్రేషన్ అయ్యే ప్రతి ఆస్తి ఖచ్చితమైన భౌగోళిక సరిహద్దులు, లొకేషన్ వివరాలు ప్రభుత్వ డిజిటల్ రికార్డుల్లో భద్రపరచడం ద్వారా భవిష్యత్తులో వచ్చే భూ వివాదాలను పూర్తిగా అరికట్టడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టింది. ఈ నూతన విధానం అందుబాటులోకి రావడంతో రియల్ ఎస్టేట్ రంగంలో ఎంతోకాలంగా వేధిస్తున్న డబుల్ రిజిస్ట్రేషన్లు, అక్రమ కబ్జాల సమస్యలకు చెక్ పడనుంది. గతంలో కేవలం కాగితాలపై తూర్పు, పడమర, ఉత్తరం, దక్షణం సరిహద్దుల పేర్లు రాసి రిజిస్ట్రేషన్లు చేసేవారు. అయితే కాలక్రమేణా చుట్టుపక్కల ఆస్తులు మారిపోవడం లేదా సరిహద్దు గుర్తులు చెరిగిపోవడంతో అనేక సివిల్ వివాదాలు కోర్టులకెక్కేవి. ఇప్పుడు జియో-ట్యాగింగ్ మరియు డిజిటల్ ప్లాట్ మ్యాపింగ్ ఆధారంగా ప్రతి...