Posts

Showing posts with the label had breakfast at a local eatery

సామాన్యుడిలా మార‍్కెట్‌ అంతా కలియతిరిగిన సీఎం డీకే శివకుమార్‌ : సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు

Image
క ర్ణాటకకు సీఎం డీకే శివకుమార్‌ సామాన్యుడిలా మార‍్కెట్‌ అంతా కలియతిరిగి చూశారు. మార్కెట్‌లో స్వయంగా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వ్యాపారులు, కూలీలతో మాట‍్లాడారు. సామాన్యుడిలా కాకా హోటల్‌లో అల్పాహారం చేసి, కూలీలతో కలిసి చాయ్ తాగుతూ గడిపారు. సీఎం అయినప్పటికీ ఆయన ఏం మారలేదంటూ సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది. డీకే శివకుమార్‌ మంగళవారం యశ్వంత్‌పూర్‌ వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్‌ కమిటీ మార్కెట్‌ ప్రాంగణాన్ని ఆకస్మికంగా సందర్శించారు. అక్కడ ఉల్లిగడ్డ రైతులు, వ్యాపారులు, మహిళా కార్మికులతో మాట్లాడారు. మార్కెట్‌లో కలియతిరిగిన సీఎం, రైతులు, వ్యాపారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఆరా తీశారు. ముఖ్యంగా ఉల్లిగడ్డల వ్యాపారానికి సంబంధించిన సమస్యలను తెలుసుకున్నారు. రైతులు తీసుకొచ్చిన పంటను తూకం వేసే సమయంలో ఏవైనా అక్రమాలు జరుగుతున్నాయా అని కూడా ప్రశ్నించారు. ఉల్లిగడ్డలను రవాణా చేసేందుకు పెరుగుతున్న ఖర్చులు తమ ఆదాయంపై ప్రభావం చూపుతున్నాయని రైతులు శివకుమార్‌కు తెలిపారు. తమ సమస్యలను తెలుసుకునేందుకు వ్యవసాయ మంత్రి మార్కెట్‌కు రావడం లేదని వారు ఫిర్యాదు చేశారు. రైతుల ఫిర్యాదులను సీఎం శ్రద్ధగా విన్నారు. వార...