Posts

Showing posts with the label free organ transplants for the poor

బెంగళూరులో 1,000 పడకల ఆసుపత్రి నిర్మాణం : అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్‌ తో ప్రభుత్వం భాగస్వామ్యం

Image
క ర్ణాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వం పేదలకు ఉచితంగా అవయవ మార్పిడి కోసం 1,000 పడకల ఆసుపత్రి నిర్మాణానికి పూనుకుంది. దీనికి అవసరమైన ఏర్పాట్లన్నింటినీ తక్షణమే చేపట్టనుంది. బెంగళూరులో ఏర్పాటు కానున్న ఈ 1,000 పడకల మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రాజెక్ట్ లో ఈ ప్రాజెక్ట్ లో అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్‌ భాగస్వామ్యం కానుంది. దశలవారీగా ఈ ప్రాజెక్ట్ అమలులోకి వస్తుంది. ఇందులో అజీమ్ ప్రేమ్ జీ ఫౌండేషన్ 1,000 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టనుంది. వైద్య విద్య శాఖ మంత్రి శరణ్ ప్రకాష్ పాటిల్ దీనికి సంబంధించిన వివరాలను ఇదివరకే వెల్లడించారు. తాజాగా ఫౌండేషన్ దీనిపై స్పందించింది. భాగస్వామ్యం కానున్నట్లు తెలియజేసింది. బెంగళూరు నిమ్హాన్స్ సమీపంలో 10 ఎకరాల ప్రభుత్వ భూమిని ఈ ఆసుపత్రి నిర్మాణానికి 99 సంవత్సరాల లీజుకు కేటాయిస్తారు. నిర్మాణం, నిర్వహణ ఖర్చులన్నింటినీ ఫౌండేషన్ భరిస్తుంది. ఆసుపత్రి స్థాపనకు అజీమ్ ప్రేమ్ జీ ఫౌండేషన్ 1,000 కోట్ల రూపాయలను కేటాయించిందని శరణ్ ప్రకాష్ పాటిల్ తెలిపారు. వార్షిక నిర్వహణకు దాదాపు 350 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుందని చెప్పారు. కిడ్నీ, లివర్, ఊపిరితిత్తులు వంటి అవయవ మార్పిడులకు అత్య...