సదరం ఫీజులు తీసుకోకూడదని నిర్ణయించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఆం ధ్రప్రదేశ్ లో దివ్యాంగుల కోసం 'సదరం' కింద స్లాట్ల బుకింగ్ ఈనెల 14న పునఃప్రారంభించనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. సాంకేతిక కారణాలతో గత సెప్టెంబరు నెలాఖరు నుంచి నిలిచిన స్లాటు బుకింగ్ లు శుక్రవారం ప్రారంభించి, డిసెంబరు నెలాఖరు వరకు కొనసాగిస్తామని తెలిపారు. ఇప్పటికే వెయిటింగ్ లిస్టులో ఉన్న సుమారు 10 వేల మందికి స్లాటు బుకింగ్ ఖరారులో తొలి ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. ఆ తరువాత కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి స్లాట్లు కేటాయిస్తామన్నారు. ఇప్పటి వరకు స్లాట్ బుకింగ్‌కు రూ.40, జారీ చేసిన సర్టిఫికెట్ ముద్రణకు రూ.40 చొప్పున ఫీజులు వసూలు చేసేవారని, దివ్యాంగుల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఇకపై ఫీజులు తీసుకోకూడదని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి తెలిపారు. సదరం కింద సామాజిక ఆసుపత్రుల్లో ప్రతి సోమవారం, ప్రాంతీయ, జిల్లా, బోధనాసుపత్రుల్లో ప్రతి మంగళవారం దివ్యాంగులకు వైద్యుల ద్వారా వైకల్య నిర్ధారణ పరీక్షలు జరుగుతాయని మంత్రి పేర్కొన్నారు. దీని ప్రకారం డిసెంబరు నెలాఖరునాటికి 31,050 మందికి వైకల్య నిర్ధారణ పరీక్షలు చేస్తామని తెలిపారు. ఇంతకుముందు 112 ఆసుపత్రు...