హైదరాబాదుకు ఏమేమి ఉన్నాయో అవన్నీ వరంగల్ కు తీసుకువస్తాం : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హై దరాబాద్ తర్వాత వరంగల్ కు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని, ఇందులో భాగంగానే వరంగల్ ఎయిర్ పోర్ట్ కు డిసెంబర్ నెలాఖరులోగా భూసేకరణ పనులు పూర్తిచేసి వచ్చే మార్చి 31లోగా ఎయిర్ పోర్టు పనులను, వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను, ఔటర్ రింగ్ రోడ్డు పనులను ప్రారంభిస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాదుకు ఏమేమి ఉన్నాయో అవన్నీ వరంగల్ కు తీసుకువస్తాం అన్నారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో 508 కోట్ల 84 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రూ.200 కోట్ల వ్యయంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవన నిర్మాణ పనులకు, రూ.130కోట్ల వ్యయంతో నిర్మించనున్న ప్రభుత్వ వైద్య కళాశాల, రూ. 56.40 కోట్ల వ్యయంతో నర్సంపేట నుండి నెక్కొండ రహదారి, రూ. 82.56 కోట్లతో హనుమకొండ -నర్సంపేట- మహబూబాబాద్ నాలుగు లైన్ల రోడ్డుకు శంకుస్థాపన చేశారు. నర్సంపేటలో రూ. 26 కోట్లతో ప్రభుత్వ నర్సింగ్ కళాశాల నిర్మాణ పనులకు, రూ. 20.కోట్లతో అంతర్గత సిసి రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, బీటీ రోడ్లు, సెంట్రల్ లైటింగ్ నిర్మాణ పనులకు, 17.28 కోట్ల వ్యయంతో నర్సంపేట నుండి పాక...