ఆంధ్రప్రదేశ్ లో వర్షాభావ పరిస్థితులు : రూ. 3,409.35 కోట్లతో జలసంరక్షణ కార్యక్రమం
ఆం ధ్రప్రదేశ్ లో ఎల్ నినో ప్రభావం వల్ల ఈ ఏడాది వర్షాకాల సీజన్ లో సగటు కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. పలు జిల్లాల్లో కరవు ఛాయలు అలముకొంటోన్నాయి. క్రమంగా మంచినీటి ఎద్దడి తలెత్తుతోంది. శ్రీశైలం రిజర్వాయర్ కు వరద జలాలు వస్తోన్నప్పటికీ అవన్నీ కూడా ఎగువన ఉన్న మహారాష్ట్ర, కర్ణాటకల్లో కురిసిన అతి భారీ వర్షాల వల్లే. ఏపీలో మాత్రం వర్షాలు ఆశించిన స్థాయిలో పడట్లేదు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం మంచినీటి ఎద్దడి నివారణపై దృష్టి పెట్టింది. ప్రజలకు ఎక్కడా మంచినీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని చంద్రబాబు ఆదేశించారు. ఎల్ నినో ప్రభావం కారణంగా తలెత్తిన పరిస్థితులను ఎదుర్కొనేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా జలధార- జలహారతి కార్యక్రమాన్ని ప్రకటించారు. నిరంతర కార్యక్రమంగా దీన్ని చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జలాశయాలు, వివిధ నీటి వనరుల్లో ప్రస్తుత లభ్యతను నిరంతరం అంచనా వేస్తూ తాగునీటి సరఫరా వ్యవస్థను పటిష్టం చేయాలని సూచించారు. తాగు నీటికి ఇబ్బంది లేకుండా ముందస్తు ప్రణాళికలను రూపొందించుకోవాలని అన్నారు. రాష్ట్రంలో సాధారణం కంటే 39 శాతం మేర లోటు వర్షపాతం సూచనలు ఉన్నాయని పేర్...