Posts

Showing posts with the label Union Finance Minister Nirmala Sitharaman

కొంతమంది అంత కుప్పకూలిపోతుందని లేనిపోని అపోహలు ప్రచారం చేస్తున్నారు !

Image
ముం బైలో జరిగిన సిడ్బి వార్షికోత్సవ కార్యక్రమంలో  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ అంతర్జాతీయ ఒడిదొడుకుల దృష్ట్యా ప్రస్తుతం ప్రభుత్వం ఇంధనం, ఎరువులు, విదేశీ  మారక నిల్వలు వంటి మూడు కీలక రంగాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించిందని ప్రధాని మోడీ స్పష్టం చేసినట్లు, దేశీయ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ ఎంతో బలంగా, స్థిరంగా ఉన్నప్పటికీ, కొంతమంది మేధావులు, విమర్శకులు అంతా కుప్పకూలిపోతోందనేలా లేనిపోని అపోహలను ప్రచారం చేస్తున్నారని ఆమె ఆక్షేపించారు. అంతర్జాతీయంగా ఎదురవుతున్న ఇబ్బందులను ఎదుర్కొంటూనే, దేశ ప్రజలకు భరోసా కల్పించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఈ సందర్భంగా ఆమె హితవు పలికారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు విపరీతంగా పెరుగుతున్నప్పటికీ, దేశీయంగా సామాన్యులపై మరియు పారిశ్రామిక రంగంపై ఆ భారం పడకుండా కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోందని నిర్మలా సీతారామన్ వివరించారు. ఇందులో భాగంగానే పెట్రోల్, డీజిల్‌లపై ఎక్సైజ్ సుంకాన్ని (Excise Duty) భారీగా తగ్గించామని, దీనివల్ల కేంద్ర ప్రభుత్వానికి రావాల్సిన సుమారు రూ. లక్ష కోట్ల ఆదాయాన్ని కోల్పోవాల్సి వస్తోందని ఆమె వెల్లడించార...

దేశ భవిష్యత్తు తీర్చిదిద్దే బాధ్యత యువతదే : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్

Image
ఆం ధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం పెదమైనవాని లంక గ్రామంలో ఆదివారం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో యూనియన్ బ్యాంకు వారి సహకారంతో రూ.18 లక్షలు విలువచేసే కంప్యూటర్లు, సైన్సు ల్యాబ్ల్ లు తదితర మౌలిక సదుపాయాలు కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించారు. కేంద్ర ఆర్థిక శాఖామంత్రితో పాటు కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమ శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర ఆర్థికశాఖా మంత్రి పయ్యావుల కేశవ్, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి డా.నిమ్మల రామానాయుడు, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పి.వి.యన్.మాధవ్, జిల్లా కలెక్టరు చదలవాడ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మీ, నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, తణుకు ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, ఏపిఐఐసి ఛైర్మన్ మంతెన రామరాజు, తదితరులు పాల్గొన్నారు. విద్యార్థిని, విద్యార్థులతో మమేకమై వారితో కొద్దిసేపు కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ముచ్చటించారు. కొన్ని ప్రశ్నలు వేసి సమాధానం రాబట్టారు. డిజిటల్ క్లాసులు ద్వారా ప్రపంచలో జరుగుచున్నవాటిని,...