Ad Code

కొంతమంది అంత కుప్పకూలిపోతుందని లేనిపోని అపోహలు ప్రచారం చేస్తున్నారు !


ముంబైలో జరిగిన సిడ్బి వార్షికోత్సవ కార్యక్రమంలో  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ అంతర్జాతీయ ఒడిదొడుకుల దృష్ట్యా ప్రస్తుతం ప్రభుత్వం ఇంధనం, ఎరువులు, విదేశీ  మారక నిల్వలు వంటి మూడు కీలక రంగాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించిందని ప్రధాని మోడీ స్పష్టం చేసినట్లు, దేశీయ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ ఎంతో బలంగా, స్థిరంగా ఉన్నప్పటికీ, కొంతమంది మేధావులు, విమర్శకులు అంతా కుప్పకూలిపోతోందనేలా లేనిపోని అపోహలను ప్రచారం చేస్తున్నారని ఆమె ఆక్షేపించారు. అంతర్జాతీయంగా ఎదురవుతున్న ఇబ్బందులను ఎదుర్కొంటూనే, దేశ ప్రజలకు భరోసా కల్పించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఈ సందర్భంగా ఆమె హితవు పలికారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు విపరీతంగా పెరుగుతున్నప్పటికీ, దేశీయంగా సామాన్యులపై మరియు పారిశ్రామిక రంగంపై ఆ భారం పడకుండా కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోందని నిర్మలా సీతారామన్ వివరించారు. ఇందులో భాగంగానే పెట్రోల్, డీజిల్‌లపై ఎక్సైజ్ సుంకాన్ని (Excise Duty) భారీగా తగ్గించామని, దీనివల్ల కేంద్ర ప్రభుత్వానికి రావాల్సిన సుమారు రూ. లక్ష కోట్ల ఆదాయాన్ని కోల్పోవాల్సి వస్తోందని ఆమె వెల్లడించారు. ఈ భారీ రెవెన్యూ నష్టాన్ని భరిస్తూనే, చమురు మార్కెటింగ్ కంపెనీలు దిగుమతులను నిలిపివేయకుండా ప్రభుత్వం తగిన మద్దతు ఇస్తోందని పేర్కొన్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ప్రారంభమైనప్పటి నుంచి అంతర్జాతీయ సరఫరా గొలుసు దెబ్బతిన్నదని, దాని ప్రభావం వల్లే దేశీయంగా ఇంధన ధరల సర్దుబాటు అనివార్యమైందని స్పష్టం చేశారు. బాధ్యతాయుతమైన పౌరులుగా దేశం సాధించిన ఆర్థిక ప్రగతిని తక్కువ చేసి చూడవద్దని, ఇలాంటి సంక్షోభ సమయాల్లో అనవసరపు భయాలను వ్యాప్తి చేయకూడదని ఆమె కోరారు.

Post a Comment

0 Comments

Close Menu