Posts

Showing posts with the label US moves to increase military pressure on Iran

ఇరాన్‌పై సైనిక ఒత్తిడిని మరింత పెంచేదుకు అమెరికా యత్నాలు : జెరాల్డ్ ఆర్ ఫోర్డ్‌ను మధ్యప్రాచ్యం వైపు తరలింపు

Image
ప్ర పంచంలో అతి పెద్ద విమాన వాహక నౌక జెరాల్డ్ ఆర్ ఫోర్డ్‌ను అమెరికా కరేబియన్ సముద్రం నుంచి మధ్యప్రాచ్యం వైపు తరలిస్తోంది. ఇరాన్‌పై సైనిక ఒత్తిడిని మరింత పెంచేందుకే ఈ చర్య తీసుకున్నట్టు అంతర్జాతీయ మీడియా వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇరాన్‌తో అణు కార్యక్రమంపై చర్చలు విఫలమైతే సైనిక చర్యకు వెనుకాడబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే హెచ్చరించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ప్రస్తుతం ఒమన్ వేదికగా ఇరు దేశాల మధ్య పరోక్షంగా చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చలు కొలిక్కి రాకపోతే దాడులకు దిగేందుకైనా సిద్ధమేనని అమెరికా సంకేతాలిస్తున్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. పశ్చిమాసియాలో ఇప్పటికే యూఎస్ఎస్ అబ్రహం లింకన్ విమాన వాహక నౌక సమూహం మోహరించి ఉంది. ఇప్పుడు జెరాల్డ్ ఫోర్డ్ కూడా చేరనుండటంతో ఆ ప్రాంతంలో అమెరికాకు చెందిన రెండు శక్తివంతమైన విమాన వాహక నౌకలు అందుబాటులో ఉంటాయి. న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం కరేబియన్‌లో ఉన్న జెరాల్డ్ ఫోర్డ్ స్ట్రైక్ గ్రూప్ అట్లాంటిక్ మహాసముద్రం, మధ్యధరా సముద్రం మీదుగా పర్షియన్ గల్ఫ్ వైపు పయనిస్తోంది. ఈ నౌకతో పాటు యూఎస్ఎస్ ఫ్రాంక్ ఈ. పీటర్సన్ జూనియర్, యూఎస్ఎస్ స్ప్ర...