నెతన్యాహుపై అరెస్ట్ వారెంట్ జారీ చేసిన టర్కీ
ఇ జ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు సహా ఆయన ప్రభుత్వంలోని సీనియర్ అధికారులపై మారణహోమం సృష్టించారనే ఆరోపణలతో టర్కీ అరెస్ట్ వారెంట్లను జారీ చేసింది. గాజాలో ఇజ్రాయెల్ పద్ధతి ప్రకారం పాల్పడిన మారణహోమం, మానవత్వానికి వ్యతిరేకమైన నేరాలపై టర్కీ చట్టపరమైన చర్యకు పూనుకుంది. ఇస్తాంబుల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ఈ కేసులో మొత్తం 37 మంది అనుమానితుల జాబితాను రూపొందించింది. ఈ జాబితాలో నెతన్యాహుతో పాటు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్, జాతీయ భద్రతా మంత్రి ఇతమార్ బెన్ గ్విర్, ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఎయాల్ జమీర్ వంటి కీలక అధికారులు ఉన్నట్లు పేర్కొంది. అయితే పూర్తి జాబితాను మాత్రం ప్రాసిక్యూటర్ కార్యాలయం వెల్లడించలేదు. ఈ అరెస్ట్ వారెంట్ల జారీకి సంబంధించిన ఫిర్యాదులో.. గాజా స్ట్రిప్‌లో టర్కీ సర్కారు నిర్మించిన "టర్కిష్-పాలస్తీనియన్ ఫ్రెండ్‌షిప్ హాస్పిటల్" అంశాన్ని కూడా ప్రస్తావించింది. మానవతా సేవలకు అంకితమైన ఈ ఆసుపత్రిని ఇజ్రాయెల్ సైన్యం మార్చి నెలలో బాంబు దాడి చేసి ధ్వంసం చేసిందని ఫిర్యాదులో తెలిపింది. ఇలాంటి చర్యలు అంతర్జాతీయ మానవతా చట్టా...