Posts

Showing posts with the label Transport Ministry issues orders

జనవరి తర్వాత తయారయ్యే అన్ని కొత్త టూ వీలర్స్ లో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ తప్పనిసరి !

Image
2026 జనవరి తర్వాత తయారయ్యే అన్ని కొత్త మోటార్‌ సైకిళ్లు, స్కూటర్లలో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ తప్పనిసరిగా అమర్చాలని రవాణా మంత్రిత్వ శాఖ తాజా ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు 125 సీసీ కంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం గల బైక్‌లకు మాత్రమే  యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అవసరంగా ఉన్నప్పటికీ, కొత్త నిబంధన ఇంజిన్ పరిమాణం తేడా లేకుండా అన్ని ద్విచక్ర వాహనాలకు వర్తించనుంది. ఈ ఆదేశం వలన భారత్‌లో రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే ప్రధాన లక్ష్యంగా కేంద్రం అడుగులు వేస్తోంది. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ వెల్లడించిన సమాచారం ప్రకారం 2022లో దేశవ్యాప్తంగా జరిగిన అన్ని ప్రమాదాల్లో 44.5 శాతం ద్విచక్ర వాహనాల వల్ల సంభవించాయి. ఈ ప్రమాదాల్లో ఎక్కువ భాగం తలకు గాయాలు లేదా నియంత్రణ కోల్పోవడం వల్ల జరిగాయని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో, ప్రభుత్వానికి  యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ లేని వాహనాల విక్రయాలను ఆపడం తప్పనిసరి చర్యగా మారింది. యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అనేది ఒక ఆధునిక భద్రతా సాంకేతికత. ఆకస్మికంగా లేదా బలంగా బ్రేక్ వేసినప్పుడు చక్రాలు లాక్ అవకుండా నిరోధించడం దీని ముఖ్య ఉద్దేశ్యం. బ్రేక్ ఒత్తి...