Posts

Showing posts with the label This service will be available from November 20 to 24

బై చేయడానికి ముందు ట్రై చేయండి : లావా అగ్ని 4 "డెమో@హోమ్" ప్రచారం

Image
లావా "అగ్ని 4" ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ సందర్భంలో కంపెనీ దేశీయ మార్కెట్‌లో తొలిసారి వినూత్నమైన ప్రయత్నం చేస్తూ.. అదిరిపోయే ఆఫర్ తీసుకొచ్చింది. వినియోగదారులు ఫోన్‌ను లాంచ్‌కు ముందే ఇంట్లోనే పరీక్షించుకునే అవకాశం కల్పిస్తోంది. లావా ఈ ప్రచార కార్యక్రమానికి "డెమో@హోమ్" అని పేరు పెట్టింది. ఇది ప్రస్తుతం భారత్‌లో ఏ ఇతర బ్రాండ్ అమలు చేయని ప్రత్యేక మార్కెటింగ్ స్ట్రాటజీగా చూడవచ్చు. లావా బృందం స్వయంగా అగ్ని 4 స్మార్ట్‌ఫోన్‌ను వినియోగదారుల ఇంటి వద్ద డెమో కోసం అందిస్తుంది. ఫోన్ డిజైన్, కెమెరా, పనితీరు, డిస్‌ప్లే క్వాలిటీ, UI అనుభవం-అన్నింటినీ వినియోగదారు చేతబట్టి పరీక్షించుకునే వీలు ఉంటుంది. నచ్చితేనే కొనుగోలు చేయవచ్చు, కొనాలని ఎలాంటి బలవంతం ఉండదని కంపెనీ స్పష్టం చేసింది. నవంబర్ 20 నుంచి 24 వరకు ఈ సేవ అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం ఈ సేవ బెంగళూరు, ఢిల్లీ, ముంబై నగరాలకు మాత్రమే పరిమితం. ముందుగా నమోదు చేసుకున్న వారిలో కొంత మందిని ఎంపిక చేసి, వారికి హోమ్ డెమో అందిస్తారు. ఈ విధానం భారతీయ వినియోగదారులకు "బై చేయడానికి ముందు ట్రై" అనుభవాన్ని ఇవ్వడం ద్వారా ...