Ad Code

బై చేయడానికి ముందు ట్రై చేయండి : లావా అగ్ని 4 "డెమో@హోమ్" ప్రచారం


లావా "అగ్ని 4" ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ సందర్భంలో కంపెనీ దేశీయ మార్కెట్‌లో తొలిసారి వినూత్నమైన ప్రయత్నం చేస్తూ.. అదిరిపోయే ఆఫర్ తీసుకొచ్చింది. వినియోగదారులు ఫోన్‌ను లాంచ్‌కు ముందే ఇంట్లోనే పరీక్షించుకునే అవకాశం కల్పిస్తోంది. లావా ఈ ప్రచార కార్యక్రమానికి "డెమో@హోమ్" అని పేరు పెట్టింది. ఇది ప్రస్తుతం భారత్‌లో ఏ ఇతర బ్రాండ్ అమలు చేయని ప్రత్యేక మార్కెటింగ్ స్ట్రాటజీగా చూడవచ్చు. లావా బృందం స్వయంగా అగ్ని 4 స్మార్ట్‌ఫోన్‌ను వినియోగదారుల ఇంటి వద్ద డెమో కోసం అందిస్తుంది. ఫోన్ డిజైన్, కెమెరా, పనితీరు, డిస్‌ప్లే క్వాలిటీ, UI అనుభవం-అన్నింటినీ వినియోగదారు చేతబట్టి పరీక్షించుకునే వీలు ఉంటుంది. నచ్చితేనే కొనుగోలు చేయవచ్చు, కొనాలని ఎలాంటి బలవంతం ఉండదని కంపెనీ స్పష్టం చేసింది. నవంబర్ 20 నుంచి 24 వరకు ఈ సేవ అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం ఈ సేవ బెంగళూరు, ఢిల్లీ, ముంబై నగరాలకు మాత్రమే పరిమితం. ముందుగా నమోదు చేసుకున్న వారిలో కొంత మందిని ఎంపిక చేసి, వారికి హోమ్ డెమో అందిస్తారు. ఈ విధానం భారతీయ వినియోగదారులకు "బై చేయడానికి ముందు ట్రై" అనుభవాన్ని ఇవ్వడం ద్వారా లావా బ్రాండ్‌పై నమ్మకం పెంచడమే లక్ష్యంగా భావిస్తున్నారు. 6.67-అంగుళాల AMOLED స్క్రీన్ డిస్‌ప్లే, 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ - గేమింగ్, వీడియోలలో సూపర్ స్మూత్ అనుభవం, హై బ్రైట్‌నెస్‌తో అవుట్‌డోర్‌లో కూడా క్లియర్ విజిబిలిటీ, MediaTek Dimensity 8350 ప్రాసెసర్, హై-పర్ఫార్మెన్స్, పవర్-ఎఫిషియెంట్ చిప్‌సెట్, గేమింగ్, మల్టీటాస్కింగ్‌లో ల్యాగ్‌లెస్ అనుభవానికి అనువైనది. LPDDR5X RAM - వేగవంతమైన యాప్ స్విచింగ్, UFS 4.0 స్టోరేజ్ - లోడ్ టైమ్‌లు చాలా తగ్గుతాయి. ఫైళ్ల ట్రాన్స్‌ఫర్ స్పీడ్ బాగా పెరుగుతుంది. 50MP ప్రైమరీ సెన్సర్, 8MP అల్ట్రా వైడ్ - ల్యాండ్‌స్కేప్ షాట్స్‌కు బెటర్, సెల్ఫీల కోసం 50MP ఫ్రంట్ కెమెరా - ఈ సిగ్మెంట్‌లో అరుదైన స్పెసిఫికేషన్, నైట్ ఫోటోగ్రఫీకి ప్రత్యేక AI ఆప్టిమైజేషన్.  Wi-Fi 6E - వేగం, స్టేబిలిటీ రెండూ మెరుగ్గా, USB 3.2 పోర్ట్ - డేటా ట్రాన్స్‌ఫర్ వేగం USB 2.0 కంటే అనేక రెట్లు ఎక్కువ, 5G మల్టీ-బ్యాండ్ సపోర్ట్. 5000mAh పెద్ద బ్యాటరీ, 66W ఫాస్ట్ ఛార్జింగ్ - కొన్ని నిమిషాల ఛార్జ్‌లోనే గంటల పాటు ఉపయోగించవచ్చు. 

Post a Comment

0 Comments

Close Menu