Posts

Showing posts with the label Thai ship Mayuri Nari Bangkok near the coast of Oman

భారత్‌కు వస్తున్న థాయ్ ఆయిల్ ట్యాంకర్‌పై ఇరాన్ క్షిపణి దాడి !

Image
భా రత్ వస్తున్న థాయ్‌లాండ్ ఆయిల్ ట్యాంకర్‌పై దాడి జరిగింది. ఒమన్ తీర సమీపంలో థాయ్ నౌక మయూరీ నారీ బ్యాంకాక్‌ను ఇరాన్ క్షిపణులు ఢీకొన్నాయి. ఈ ఘటనతో థాయ్‌లాండ్ నౌకదళం, అంతర్జాతీయ తీరప్రాంత అధికారులు అప్రమత్తమయ్యారు. తక్షణమే అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షిపణి దాడితో నౌక మంటల్లో చిక్కుకుని సగం కాలిపోయింది. 20 మంది సిబ్బందిని కాపాడమని, మరో ముగ్గురు గల్లంతయ్యారని అధికారులు తెలిపారు. హర్మూజ్ జల సంధిలో థాయ్‌లాండ్ నౌకపై తామే క్షిపణితో దాడిచేసినట్టు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ తాజాగా ప్రకటించింది. మయూరీ నారీ బ్యాంకాక్ ట్యాంకర్ గుజరాత్‌లోని కాండ్లా పోర్టుకు వస్తుండగా ఘటన చోటుచేసుకుంది. మరో రెండు నౌకలు కూడా భద్రతా కారణాలతో హర్మూజ్ జలసంధిలో చిక్కుకుపోయాయి. ఇజ్రాయెల్-అమెరికా దాడులతో హర్మూజ్ జల సంధిను మూసివేసిన ఇరాన్.. ఆయిల్ సరఫరాను అడ్డుకుంటోంది. దీంతో చమురు, గ్యాస్ రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడి.. అంతర్జాతీయ మార్కెట్‌లను తీవ్రంగా ప్రభావితం చేసింది. ఈ నేపథ్యంలో థాయ్‌లాండ్ కార్గో నౌకపై దాడి మరింత భయాందోళనకు గురిచేస్తోంది. థాయ్‌ కంపెనీ ప్రీసియస్ షిప్పింగ్‌కు చెందిన మయూరీ నారీ బ్యాంకక్...