Posts

Showing posts with the label State Governor Shiv Pratap Shukla inaugurated the program

తెలంగాణలో డిజిటల్ జనగణన ప్రారంభం

Image
తె లంగాణలో 'సెన్సస్ 2027' డిజిటల్ జనాభా లెక్కల ప్రక్రియ ఆదివారం అధికారికంగా ప్రారంభమైంది. రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్వయంగా ఆన్‌లైన్ పోర్టల్‌లో తన వివరాలను నమోదు చేసి సెల్ఫ్ ఎన్యూమరేషన్ (స్వయం నమోదు) ప్రక్రియలో పాల్గొన్నారు. పారదర్శకతను పెంచేందుకు దేశంలోనే మొదటిసారిగా పూర్తిస్థాయి డిజిటల్ విధానంలో ఈ గణన చేపడుతున్నారు. ప్రస్తుతం కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో ఈ ప్రక్రియ మొదలైంది. ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు 15 రోజుల పాటు పౌరులు తమ వివరాలను se.census.gov.in వెబ్‌సైట్‌లో స్వచ్ఛందంగా నమోదు చేసుకోవచ్చు. రోజుకు ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు పోర్టల్ అందుబాటులో ఉంటుంది. ఇందులో గృహ సౌకర్యాలకు సంబంధించిన 33 ప్రశ్నలు ఉంటాయి. ఎలాంటి పత్రాలు అప్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదు, 15-20 నిమిషాల్లో ప్రక్రియ పూర్తవుతుంది. వివరాలు సమర్పించాక వచ్చే 'సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడీ'ని, తర్వాత ఇంటికి వచ్చే అధికారులకు చూపించాల్సి ఉంటుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి జనగణన ఇదే కావడం విశేషం. మే 11 నుం...