Posts

Showing posts with the label Shifted

తెలంగాణలో 31 లక్షల ఓట్లు గల్లంతు?

Image
తె లంగాణలో నిర్వహిస్తున్న ఓటర్ల సవరణ ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయిలో అందుబాటులో లేని దాదాపు 31 లక్షల ఫారమ్‌లను ఎన్నికల సంఘం ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెడ్, డూప్లికేట్, ఫారిన్ కేటగిరీ కింద వర్గీకరించి తొలగింపునకు సిద్ధం చేసింది. హైదరాబాద్ జిల్లాలోనే ఆదివారం నాటికి 51 శాతం ఎన్యుమరేషన్ ఫారమ్‌ల డిజిటైజేషన్ పూర్తి కాగా, ఇప్పటివరకు ఏకంగా 4.21 లక్షల మందిని ఈ జాబితాలో చేర్చినట్లు సీఈవో వెల్లడించారు. ఆగస్టు 3వ తేదీ నాటికి ఎన్యుమరేషన్ దశను పూర్తి చేయాలనే లక్ష్యంతో బూత్ స్థాయి అధికారులు , బూత్ లెవెల్ ఏజెంట్లు ఈ ప్రక్రియను వేగవంతం చేస్తుండటంతో, సరైన తనిఖీలు జరగక ప్రతి పోలింగ్ బూత్‌లో వందలాది మంది అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సరైన నిబంధనలు , ప్రామాణిక ప్రక్రియలను పాటించకుండానే ముందస్తుగా చాలా మంది ఓటర్లను ASDDF జాబితాలో చేర్చుతున్నారని పలు నియోజకవర్గాల్లో తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఆగస్టు 3వ తేదీ నాటికి ఎన్యుమరేషన్ ప్రక్రియను పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారుల నుంచి వస్తున్న తీవ్ర ఒత్తిడి వల్ల, బీఎల్‌ఓలు ప్రతీ ఇంటికి కనీసం మూడు సార్లు వెళ్లాలనే...