Posts

Showing posts with the label Pakistan hockey team captain Shakeel Ahmed Butt banned for two years

పాకిస్తాన్ హాకీ జట్టు కెప్టెన్ షకీల్ అహ్మద్ భట్ పై రెండేళ్ల నిషేధం విధించిన బోర్డు

Image
ఇ టీవల ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన పాకిస్తాన్ జట్టుకు అక్కడ మైదానంలోనే కాకుండా బయట కూడా తీవ్ర అవమానాలు ఎదురయ్యాయి. ఆస్ట్రేలియా జర్మనీలతో జరిగిన మ్యాచ్‌ల్లో ఓటమి పాలవ్వడమే కాకుండా మైదానం బయట జరిగిన పరిణామాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత అహ్మద్ భట్ బోర్డు మేనేజ్‌మెంట్‌పై చేసిన వ్యాఖ్యలు పాకిస్తాన్ హాకీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆస్ట్రేలియా పర్యటనలో తమకు ఎదురైన గడ్డు పరిస్థితుల గురించి పాక్ హాకీ కెప్టెన్ అహ్మద్ భట్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆటగాళ్లను వంటగది శుభ్రం చేయమని, తిన్న గిన్నెలు కడగమని మేనేజ్‌మెంట్ బలవంతం చేసిందని ఆయన ఆరోపించారు. కేవలం ఇది మాత్రమే కాకుండా, నిధుల కొరత కారణంగా హోటల్ బుకింగ్స్ రద్దయ్యాయని, దీంతో ఆటగాళ్లు రోడ్ల మీద తిరగాల్సిన పరిస్థితి వచ్చిందని వెల్లడించారు. సిడ్నీ ఎయిర్‌పోర్టులో సుమారు 12 గంటల పాటు నిరీక్షించాల్సి వచ్చిందని, ప్రస్తుత మేనేజ్‌మెంట్‌తో ఆటగాళ్లు కలిసి పనిచేయడం అసాధ్యమని ఆయన స్పష్టం చేశారు. బోర్డుపై బహిరంగంగా విమర్శలు చేయడం, నిరాధారమైన ఆరోపణలు చేస్తూ క్రమశిక్షణ ఉల్లంఘించారనే సాకుతో ఆయనపై రెండేళ్ల పాటు నిషేధం వి...