పాకిస్తాన్ హాకీ జట్టు కెప్టెన్ షకీల్ అహ్మద్ భట్ పై రెండేళ్ల నిషేధం విధించిన బోర్డు


టీవల ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన పాకిస్తాన్ జట్టుకు అక్కడ మైదానంలోనే కాకుండా బయట కూడా తీవ్ర అవమానాలు ఎదురయ్యాయి. ఆస్ట్రేలియా జర్మనీలతో జరిగిన మ్యాచ్‌ల్లో ఓటమి పాలవ్వడమే కాకుండా మైదానం బయట జరిగిన పరిణామాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత అహ్మద్ భట్ బోర్డు మేనేజ్‌మెంట్‌పై చేసిన వ్యాఖ్యలు పాకిస్తాన్ హాకీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆస్ట్రేలియా పర్యటనలో తమకు ఎదురైన గడ్డు పరిస్థితుల గురించి పాక్ హాకీ కెప్టెన్ అహ్మద్ భట్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆటగాళ్లను వంటగది శుభ్రం చేయమని, తిన్న గిన్నెలు కడగమని మేనేజ్‌మెంట్ బలవంతం చేసిందని ఆయన ఆరోపించారు. కేవలం ఇది మాత్రమే కాకుండా, నిధుల కొరత కారణంగా హోటల్ బుకింగ్స్ రద్దయ్యాయని, దీంతో ఆటగాళ్లు రోడ్ల మీద తిరగాల్సిన పరిస్థితి వచ్చిందని వెల్లడించారు. సిడ్నీ ఎయిర్‌పోర్టులో సుమారు 12 గంటల పాటు నిరీక్షించాల్సి వచ్చిందని, ప్రస్తుత మేనేజ్‌మెంట్‌తో ఆటగాళ్లు కలిసి పనిచేయడం అసాధ్యమని ఆయన స్పష్టం చేశారు. బోర్డుపై బహిరంగంగా విమర్శలు చేయడం, నిరాధారమైన ఆరోపణలు చేస్తూ క్రమశిక్షణ ఉల్లంఘించారనే సాకుతో ఆయనపై రెండేళ్ల పాటు నిషేధం విధించింది. ఈ చర్యతో షకీల్ అహ్మద్ భట్ కెరీర్ ప్రమాదంలో పడింది. ఒక జాతీయ జట్టు కెప్టెన్‌ను ఇలాంటి పరిస్థితుల్లో నిషేధించడం పట్ల క్రీడా విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదం ముదరడంతో పాకిస్తాన్ హాకీ ఫెడరేషన్ ప్రెసిడెంట్ తారిక్ బుగ్తీ తన పదవికి రాజీనామా చేశారు. పాకిస్తాన్ స్పోర్ట్స్ బోర్డు నుంచి నిధులు సకాలంలో విడుదల కాకపోవడం వల్లే లాజిస్టికల్ సమస్యలు తలెత్తాయని ఆయన ఆరోపించారు. హోటల్ బిల్లుల చెల్లింపులో జాప్యం జరిగిన మాట వాస్తవమేనని, అయితే తక్కువ వనరులతోనే తాము ఉత్తమ ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరపాలని ఆయన పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ను కోరారు. తన హయాంలో పాకిస్తాన్ ర్యాంకింగ్ 18 నుంచి 13కు మెరుగుపడిందని ఆయన గుర్తు చేశారు.

Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం