Posts

Showing posts with the label Nitin Gadkari to Priyanka Gandhi

మీ సోదరుడి పనులు చేశాను, మీ పనులు చేయకపోతే మీరు ఫిర్యాదు చేస్తారు కదా !

Image
పా ర్లమెంట్ ప్రాంగణంలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా మధ్య జరిగిన భేటీ రాజకీయంగా ఆసక్తిని రేకెత్తించింది. కేరళలోని రహదారి ప్రాజెక్టుల గురించి చర్చించేందుకు జరిగిన ఈ సమావేశంలో అటు సీరియస్ చర్చలు, ఇటు సరదా సంభాషణలు, ఓ ప్రత్యేక వంటకం హైలైట్‌గా నిలిచాయి. వయనాడ్ ఎంపీగా ఎన్నికైన తర్వాత ప్రియాంకా గాంధీ తన నియోజకవర్గ సమస్యలపై కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. ఈ క్రమంలో ప్రియాంకా గాంధీ నితిన్ గడ్కరీని కలిసి కేరళ మీదుగా వెళ్లే ఆరు ప్రధాన రహదారి ప్రాజెక్టుల గురించి చర్చించారు. ఈ సమావేశంలో ఓ ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. ప్రియాంకా గాంధీ కంటే ముందే ఆమె సోదరుడు, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తన నియోజకవర్గం రాయ్‌బరేలీకి సంబంధించిన రోడ్డు పనుల గురించి కేంద్ర మంత్రి గడ్కరీని కలిశారు. దీనిని గుర్తు చేస్తూ గడ్కరీ "మీ సోదరుడి పనులు చేశాను, ఇప్పుడు మీ పనులు చేయకపోతే అన్నయ్య పనులు చేశారు కానీ నావి చేయలేదని మీరు ఫిర్యాదు చేస్తారు కదా!" అని చమత్కరించారు. ఈ మాటలకు ప్రియాంకా గాంధీతో పాటు అక్కడున్న వారంతా నవ్వుల్లో మునిగిపోయారు. రా...