Posts

Showing posts with the label Motorists Queue Up at Fuel Stations Across the Telugu States

తెలుగు రాష్ట్రాల్లో బంకుల వద్ద బారులుతీరిన వాహనదారులు

Image
తె లుగు రాష్ట్రాల్లో పలు బంకుల వద్ద పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులు పెద్ద ఎత్తున క్యూ లైన్లలో కనిపిస్తున్నారు. దీంతో ప్రభుత్వం అప్రమత్తం అయింది. ఏపీలో ఇంధన కొరత పైన ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. అదే సమయంలో తెలంగాణలోనూ కొరత ఉందంటూ వాహనదారులు పెట్రోల్ బంకుల వద్దకు చేరుకుంటున్నారు. ఈ సమయంలో వీరికి ప్రభుత్వం కీలక సూచన చేసింది. తెలంగాణలో పెట్రోల్ కొరత ఉందంటూ హైదరాబాద్ సహా పరిసర ప్రాంతాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పెట్రోల్ బంకుల వద్దకు చేరుకుంటున్నారు. పెట్రోల్ సమస్య పెరుగుతుందనే ఆందోళనతో పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. షేక్‌పేట్‌, గచ్చిబౌలి, మాదా పూర్‌, కూకట్‌పల్లితోపాటు పలు బం కులు వద్దకు పెద్ద సంఖ్యలో క్యూకట్టారు. కాగా, జేఎన్‌టీయూ ఎదురుగా ఉన్న ఓ బంకు సాయంత్రం 5గంటలకే మూతపడింది. అలాగే, బాలానగర్‌ మెట్రో స్టేషన్‌, చిత్తారమ్మ దేవాల యం సమీపాన బంకుల వద్ద కూడా ఇదే పరిస్థితి ఉంది. రైతులు పెద్ద ఎత్తున డీజిల్ కొనుగోళ్ల కోసం సమీప పెట్రోల్ బంకుల వద్దకు చేరుకుంటున్నారు. దీని పైన తెలంగాణ పౌర సరఫరాల శాఖ కమిషన్ స్టీఫెన్ రవీంద్ర కీలక ప్రకటన చేసారు. తెలంగాణలో డీజిల్, పెట్రోల్ కొరత లేదని.. పూర్తి నిల్వ...