Posts

Showing posts with the label Modi's government has completely failed

మోడీ ప్రభుత్వం జ్ఞానేష్​తో ఎన్నికలను నిర్వహిస్తుంది !

Image
దే శంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, పెట్టుబడుల క్షీణత, సరఫరా గొలుసు లోపాలను సరిగ్గా నిర్వహించడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ మేరకు కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇన్‌చార్జ్ జనరల్ సెక్రటరీ జైరామ్ రమేష్ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఒక సుదీర్ఘ ప్రకటన విడుదల చేశారు. ప్రధాని మోడీ ఇటలీ పర్యటన సందర్భంగా సోషల్ మీడియాలో వైరల్ అయిన ‘మెలోడీ’ టాఫీ అంశాన్ని ప్రస్తావిస్తూ ఆయన ఘాటు విమర్శలు చేశారు. దేశ ప్రధానమంత్రి టోఫీలు పంచే పనిలో, ప్రజలకు నీతిబోధలు చేయడంలో బిజీగా ఉన్నారని, కానీ దేశ ఆర్థిక వ్యవస్థను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మోడీ ప్రభుత్వం ‘జ్ఞానేశ్​తో ఎన్నికలను నిర్వహిస్తోందని’, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి ఆర్థిక వ్యవస్థపై ‘కొత్త జ్ఞానం’ అవసరమని ఎద్దేవా చేశారు. దేశంలో ప్రైవేట్ పెట్టుబడులు స్తంభించిపోవడంపై కాంగ్రెస్ నిరంతరం ఆందోళన వ్యక్తం చేస్తోందని జైరాం రమేష్ పేర్కొన్నారు. ఆయన తన ప్రకటనలో ప్రధానంగా ప్రస్తావించిన అంశాలు. దేశంలో వాస్తవ వేతనాలు పెరగకపోవడం వల్ల అన్ని ఆదాయ వర్గాల్లో వినియోగ వృద్ధి పడిపోయింది. మార్కెట్‌లో డిమాండ్ లేనప్పుడు ప్...