Posts

Showing posts with the label Minister T.G. Bharat at Rising Bharat Summit - South Edition 2026

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా తిరిగి వేగంగా అడుగులు వేస్తోంది : రైజింగ్ భారత్ సమ్మిట్ - సౌత్ ఎడిషన్ 2026లో మంత్రి టి.జి. భరత్

Image
ద క్షిణ భారతదేశంలో పారిశ్రామిక, వ్యాపార రంగాల అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ కీలక కేంద్రంగా అవతరిస్తోందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి. భరత్ తెలిపారు. న్యూస్18 నిర్వహించిన రైజింగ్ భారత్ సమ్మిట్ - సౌత్ ఎడిషన్ 2026లో ప్రత్యేక చర్చలో పాల్గొన్న ఆయన, రాష్ట్రంలో పెట్టుబడులు, మౌలిక సదుపాయాల విస్తరణ, పరిశ్రమల స్థాపన, స్టార్టప్‌ల ప్రోత్సాహం వంటి అంశాలపై ప్రభుత్వ ప్రణాళికలను వివరించారు. కర్నాటక, తెలంగాణ, తమిళనాడు వంటి రాష్ట్రాలు ఇప్పటికే బలమైన పారిశ్రామిక వ్యవస్థను ఏర్పరచుకున్నాయని పేర్కొన్న మంత్రి, రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ పలు సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ అభివృద్ధి దిశగా తిరిగి వేగంగా అడుగులు వేస్తోందన్నారు. 2014 నుంచి 2019 వరకు ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లిందని, అనంతరం 2019లో అధికారాన్ని కోల్పోయినా, 2024 ఎన్నికల్లో భారీ మెజారిటీతో మళ్లీ ప్రజలు తమకు అవకాశం ఇచ్చారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రజలు ప్రస్తుత ప్రభుత్వంపై పెద్దఎత్తున ఆశలు పెట్టుకున్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు 1,050 కిలోమీటర్లకు పైగా సముద్ర తీర ప్రాంతం ఉండటం పెద్ద బలమని మంత్...