Posts

Showing posts with the label KTR Praises in Delhi Media Interaction

రైతులకు నీటి కొరత రాకుండా ఏపీ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంది : ఢిల్లీలో మీడియాతో జరిగిన ఒక చిట్‌చాట్ లో కేటీఆర్ ప్రశంస

Image
ఆం ధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వ పనితీరును బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు ఆకాశానికెత్తేశారు. ఎల్‌నినో ముప్పు ముంచుకొస్తున్న కష్టకాలంలోనూ ఏపీ సర్కార్ వ్యవహరిస్తున్న తీరు అద్భుతమంటూ ప్రశంసలు గుప్పించారు. ఢిల్లీలో మీడియాతో జరిగిన ఒక చిట్‌చాట్ సందర్భంగా కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో హాట్ న్యూస్ గా మారింది. సాధారణంగా గోదావరి జలాల తరలింపు, పట్టిసీమ ప్రాజెక్టులపై గతంలో రెండు రాష్ట్రాల మధ్య భిన్నమైన రాజకీయ వాదనలు వినిపించేవి. కానీ, కేటీఆర్ ఇప్పుడు ఏపీ ప్రభుత్వ జల వ్యూహాన్ని ఓ రేంజ్‌లో సమర్థించారు. ఎల్‌నినో పరిస్థితులు వెంటాడుతున్నప్పటికీ ఏపీలో రైతులకు నీటి కొరత రాకుండా అక్కడి ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుందని కేటీఆర్ కొనియాడారు. ఈ క్లిష్ట సమయంలోనూ పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా నీటిని ఎత్తిపోస్తూ రైతు ప్రయోజనాలకు ఏపీ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని అభినందించారు. సముద్రంలోకి వృథాగా పోయే ప్రతి చుక్క నీటిని వాడుకునేందుకు ఏపీ ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తోందని, అక్కడి సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తోందని చెప్పార...