ఫ్యూచర్ సిటీలో ప్రజాప్రతినిధులు, సివిల్ సర్వీస్ అధికారులు, జర్నలిస్టులకు 500 ఎకరాలు కేటాయింపు !
భా రత్ ఫ్యూచర్ సిటీలో నెట్ జీరో సిటీ తరహాలోనే డిజైన్స్ ఉండాలని, మౌలిక వసతుల కల్పన అంతర్జాతీయ స్థాయిలో ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఇందులో రాజీ పడొద్దని అన్నారు. ఇక్కడ భూమి కేటాయింపు, పరిశ్రమల ఏర్పాటుపై ఎంసీఆర్ హెచ్ ఆర్ డీ బోధి పెవిలియన్ లో ముఖ్యమంత్రి బుధవారం సమీక్ష నిర్వహించారు. అంతర్జాతీయ స్థాయి నగరాలను అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. ట్రంక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేసిన తర్వాతే భూ కేటాయింపులు చేయాలని, అంతర్జాతీయస్థాయి సంస్థలను ఫ్యూచర్ సిటీకి తీసుకురావాలి కోరారు. ఫ్యూచర్ సిటీలో ప్రజాప్రతినిధులు, సివిల్ సర్వీస్ అధికారులు, జర్నలిస్టులకు 500 ఎకరాలు కేటాయించాలన్నారు. కేంద్రం ప్రకటించిన హెల్త్ క్లస్టర్ ఫ్యూచర్ సిటీకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అవసరం అయితే ప్రధాని మోడీని కలిసి హెల్త్ క్లస్టర్ కేటాయించాలని విజ్ఞప్తి చేద్దామన్నారు. జూన్‌లో ఫ్యూచర్ సిటీ ఇండ్రస్టియల్ పార్క్‌లో పరిశ్రమల ఏర్పాటుకు శంకుస్థాపన జరిగేలా చూడాలన్నారు. భూ కేటాయింపు జరిగిన వెంటనే పరిశ్రమలు నిర్మాణం మొదలు పెట్టేలా నిబంధన విధించాలని సూచించారు. ఇన్వెస్ట్ తెలంగాణ పేరులో పెట్టుబడు...