వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్స్ 2025లో పతకాల పంట పండించిన భారత బాక్సర్లు
నో యిడాలోని షహీద్ విజయ్ సింగ్ పథిక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వేదికగా జరిగిన వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్స్ 2025లో భారత బాక్సర్లు ఊహించని విజయాన్ని నమోదు చేసి ఏకంగా 9 స్వర్ణ పతకాలను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించారు. సొంత ప్రేక్షకుల ప్రోత్సాహం నేపథ్యంలో భారత క్రీడాకారులు ప్రదర్శించిన పోరాటం పతకాల పట్టికలో అగ్రస్థానానికి చేర్చింది. టోర్నమెంట్‌లోని 20 మంది భారత బాక్సర్లలో ప్రతి ఒక్కరూ పోడియంపై నిలవడం విశేషం. భారత్ మొత్తం 9 స్వర్ణాలు, 6 రజతాలు, 5 కాంస్య పతకాలతో తన ప్రస్థానాన్ని ముగించింది. ఈ టోర్నమెంట్‌లో భారత మహిళా బాక్సర్లు తమ పంచ్‌లతో పతకాల పంటను పండించారు. మొత్తం 9 స్వర్ణాల్లో 7 స్వర్ణాలు మహిళల విభాగంలోనే రావడం విశేషం. మీనాక్షి (48 కిలోల విభాగం): ఆమె ప్రస్తుత ఆసియా ఛాంపియన్ ఫర్జోనా ఫోజిలోవాపై 5:0తో తిరుగులేని విజయం సాధించింది. ఆమె వేగం, ఖచ్చితత్వం, బలమైన డిఫెన్స్‌తో పాటు మొదటి రౌండ్‌లోనే ఇచ్చిన అద్భుతమైన లెఫ్ట్-రైట్ కాంబినేషన్ ఈ విజయానికి కీలకం. ప్రీతి (54 కిలోలు) ఇటలీకి చెందిన సిరీన్ చర్రాబీని 5:0 తేడాతో ఓడించింది. ఆమె నిరంతర ఒత్తిడి, క్లీన్ స్కోరింగ్ పంచ్‌లు ఆమెకు సునాయాస విజయాన్ని ...