Posts

Showing posts with the label Immigration Office in Visakhapatnam

విశాఖపట్నంలో ఇమ్మిగ్రేషన్ ఆఫీసు !

Image
వి శాఖపట్నంలో బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ (బీవోఐ) ఆఫీసు ఏర్పాటు చేసేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. విశాఖతో పాటు ఉత్తరాంధ్ర ప్రాంతాల నుంచి విదేశీ ప్రయాణాలు చేసే వారికి ఇమ్మిగ్రేషన్ సహకారం అందించేందుకు వీలుగా ఈ కార్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. ఇప్పటికే విశాఖ నుంచి భోగాపురానికి ఎయిర్ పోర్టును తరలించేందుకు వీలుగా జరుగుతున్న ప్రయత్నాలకు కొనసాగింపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ విశాఖతో పాటు ఉత్తరాంధ్ర ప్రజలు విదేశాలకు వెళ్లేందుకు ఇమ్మిగ్రేషన్ సేవల కోసం హైదరాబాద్ లేదా చెన్నై వెళ్లాల్సి వస్తోంది. విశాఖలో ఇప్పుడు బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ కార్యాలయం ఏర్పాటైతే ఆ ఇబ్బందులు తప్పుతాయి. సమయం కూడా ఆదా అవుతుంది. భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభమయ్యాక సాధారణ ప్రయాణికులతో పాటు విదేశీ విమానాల రాక, కార్గో సేవలు విస్తరించే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ కొత్త కార్యాలయం ఏర్పాటుకు అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సిబ్బంది కొరత, సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల తగిన స్ధాయిలో ఇమ్మిగ్రేషన్ తనిఖీలు చేయట్లేదు. అందువల్ల, ఇమ్మిగ్రేషన్ తనిఖీలను నిర్వహించడానికి వైజాగ్‌లో ఇమ్మిగ్రేషన్...