Posts

Showing posts with the label ICC has stated that it will review the media accreditation process

టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్‌ల కవరేజీ : బంగ్లాదేశ్‌ క్రీడా జర్నలిస్టులకు అనుమతి నిరాకరణ

Image
టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్‌ల కవరేజీ కోసం దరఖాస్తు చేసుకున్న బంగ్లాదేశ్‌కు చెందిన క్రీడా జర్నలిస్టులకు అనుమతి నిరాకరించింది. దాదాపు వందకుపైగా అప్లికేషన్లను అంతర్జాతీయ క్రికెట్ మండలి తిరస్కరించింది దాంతో తమ బోర్డు చేసిన తప్పిదానికి మమల్ని శిక్షించవద్దని వారు వేడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మీడియా అక్రిడిటేషన్స్‌ జారీని మరోసారి పరిశీలిస్తామని ఐసీసీ వెల్లడించింది. భారత్‌లో వరల్డ్‌కప్ కోసం తమ జట్టును పంపబోమని బెట్టుచేసిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. భద్రతా కారణాలను సాకుగా చూపి మేము ఆడమంటే ఆడమని పంతం పట్టినందుకు బంగ్లాదేశ్‌ను తప్పించిన స్కాంట్లాండ్‌కు అవకాశమిచ్చింది ఐసీసీ. ఇప్పుడు వరల్డ్‌కప్ కవరేజీ కోసం దరఖాస్తు చేసుకున్న క్రీడా జర్నలిస్ట్‌లకు అనుమితివ్వలేదు ఐసీసీ. ఈ విషయంపై బంగ్లా బోర్డు మీడియా అధ్యక్షుడు హంజద్ హొసేన్ తిరస్కరణకు కారణాలు తెలపాలని ఐసీసీని కోరాడు. 'మా దేశ క్రీడా జర్నలిస్ట్‌ల దరఖాస్తులను తిరస్కరించారనే విషయం సోమవారం తెలిసింది. అందుకు కారణం తెలపాలని ఐసీసీని కోరాం. ఇది అంతర్గత వ్యవహారం. అయితే ఐసీసీ ఎందుకు మావాళ్లకు అనుమతి ఇవ్వలేదో తెలుసుకోవాలనుకుంటున్న...