నా వీర్యాన్ని ఉపయోగించి పిల్లలను కనాలనుకునే మహిళలకు ఉచితంగా ఐవీఎఫ్ చికిత్స చేయిస్తా !
తన వీర్యాన్ని ఉపయోగించి పిల్లలను కనాలనుకునే మహిళలకు ఉచితంగా ఐవీఎఫ్ చికిత్స చేయిస్తానని టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్ ప్రకటించారు. అంతేకాకుండా తన వీర్యం ద్వారా పుట్టిన పిల్లలందరికీ తన 17 బిలియన్ డాలర్ల ఆస్తిలో సమాన వాటా ఇస్తానని వాగ్దానం చేశారు. 41 ఏళ్ల పావెల్ దురోవ్ తన వీర్య దానం ద్వారా ఇప్పటికే వంద మందికి పైగా జీవసంబంధిత పిల్లలకు తండ్రి అయ్యారు. వీరితో పాటు ముగ్గురు భాగస్వాముల ద్వారా ఆయనకు మరో ఆరుగురు పిల్లలు ఉన్నారు. తన ఆస్తి పంపకంపై ఆయన కొన్ని షరతులు విధించారు. వారసత్వం కావాలనుకునే వారు తమకు పావెల్ దురోవ్‌తో జన్యుపరమైన సంబంధం ఉందని నిరూపించుకోవాలి. దురోవ్ మరణించిన 30 ఏళ్ల తర్వాతే ఆ పిల్లలకు ఆస్తిలో వాటా లభిస్తుంది. తన సొంత పిల్లలకు, వీర్య దానం ద్వారా పుట్టిన పిల్లలకు మధ్య తను ఎలాంటి తేడా చూపనని ఆయన స్పష్టం చేశారు. పర్యావరణ కాలుష్యం, ముఖ్యంగా ప్లాస్టిక్ కాలుష్యం వల్ల పురుషులలో వీర్య కణాల నాణ్యత పడిపోతోందని పావెల్ దురోవ్ ఆందోళన వ్యక్తం చేశారు. నాణ్యమైన వీర్యం కొరతను తీర్చడం, సంతానలేమి సమస్యతో బాధపడే వారికి సహాయపడటం తన బాధ్యత అని ఆయన భావిస్తున్నారు. 2010లో ఒక స్నేహితుడికి సహా...