Posts

Showing posts with the label Hooligans in Kushaiguda

కుషాయిగూడలో ఆకతాయిల ఆగడం : బొలేరో కారుతో ఢీకొట్టి, కిలోమీటరు దూరం ఈడ్చుకెళ్లిన యువకులు

Image
హై దరాబాద్ లోని కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో  ప్రైవేట్ ఉద్యోగిని బొలెరో కారుతో ఢీకొట్టి, కిలోమీటరు దూరం ఈడ్చుకెళ్లి, కొందరు యువకులు అతని ప్రాణాలను గాలిలో కలిపే ప్రయత్నం చేశారు. బాధిత కుటుంబ సభ్యులు , స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సతీష్ అనే వ్యక్తి ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. విధి నిర్వహణ ముగించుకుని రాత్రి సమయంలో తన కారులో ఇంటికి వెళ్తున్నాడు. ఇదే క్రమంలో ఒక బొలెరో కారులో ఉన్న కొందరు యువకులు కారుకు సైరన్ వేసుకుంటూ, అతివేగంతో రోడ్డుపై హంగామా సృష్టించారు. సతీష్ కారును బొలెరోతో బలంగా ఢీకొట్టిన ఆ యువకులు, కనీసం ఆపకుండా వేగంగా వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. దీంతో సతీష్ వారిని వెంబడించి కొంత దూరం వెళ్ళాక ఆపగలిగాడు. కారు దిగి దుండగుల బొలెరోకు ఎదురుగా నిల్చుని, ఎందుకు ఢీకొట్టారని ప్రశ్నించే ప్రయత్నం చేశాడు. అయితే, ఏమాత్రం కనికరం లేని ఆ యువకులు కారును సతీష్ వైపు వేగంగా పోనిచ్చారు. కారు వేగంగా రావడంతో సతీష్ కిందపడిపోయి, ప్రాణ రక్షణ కోసం బొలెరో ముందున్న బంపర్‌ను గట్టిగా పట్టుకున్నాడు. కారు కింద మనిషి ఉన్నాడని తెలిసినా, ఆ పోకిరీలు కనికరించలేదు. సుమారు 700 మీటర్ల నుండి ఒక కిలో...