Posts

Showing posts with the label Green Signal for Adilabad Airport

ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు గ్రీన్ సిగ్నల్ : డిసెంబర్ 31లోగా భూసేకరణ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ

Image
తె లంగాణ ప్రభుత్వం ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.2,278.14 కోట్లకు పరిపాలనా అనుమతి, 2,009.23 ఎకరాల భూసేకరణకు ఆదేశాలు జారీ చేసింది. ఐఏఎఫ్ కోసం 1,609.23 ఎకరాలు, సివిల్ ఏవియేషన్‌కు 400 ఎకరాలు వాడనుంది. జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్‌గా ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌ను అభివృద్ధి చేస్తారు. ఎంఆర్ ఓ, కార్గో, ప్యాసింజర్ సేవలకు ఎయిర్‌పోర్ట్ రూపకల్పన ఉండనుంది. భూసేకరణ, రోడ్ల మళ్లింపు, విద్యుత్ టవర్ల తొలగింపునకు నిధులు వాడతారు. హైటెన్షన్ లైన్లు, నీటి వనరుల మార్పునకు ప్రత్యేక ప్రణాళిక వేస్తున్నారు. 2026 డిసెంబర్ 31లోగా భూసేకరణ పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.