Posts

Showing posts with the label Google AI Data Center in Space to Overcome Power Consumption and Space Issues on Earth

భూమిపై విద్యుత్ వినియోగం, స్థల సమస్యలను అధిగమించేందుకు అంతరిక్షంలో గూగుల్ ఏఐ డేటా సెంటర్

Image
భూ మిపై విద్యుత్ వినియోగం, స్థల సమస్యలను అధిగమించడమే ప్రధాన లక్ష్యంగా గూగుల్ అంతరిక్షంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్‌ 'ప్రాజెక్ట్ సన్‌క్యాచర్' పేరుతో స్థాపిస్తుంది. ఈ ప్రాజెక్ట్ ప్రపంచంలోని ఇతర టెక్ కంపెనీలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రాజెక్ట్ సన్‌క్యాచర్ అంటే సూర్యకాంతిని పట్టుకోవడం. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా భూమికి దగ్గరగా ఉన్న కక్ష్యలో అనేక శాటిలైట్‌లను ఒక సమూహంగా గూగుల్ ఏర్పాటు చేయనుంది. ఈ శాటిలైట్లు గూగుల్‌కు చెందిన ప్రత్యేక టెన్సార్ ప్రాసెసింగ్ యూనిట్లతో అనుసంధానించబడి ఉంటాయి. ఈ శాటిలైట్లన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానించబడి అవసరమైతే భూమికి కూడా అనుసంధానించబడి, అంతరిక్షంలోనే ఒక ఏఐ డేటా సెంటర్‌లా పనిచేస్తాయి. అంతరిక్షంలో సూర్యకాంతి చాలా శక్తివంతంగా, దాదాపు నిరంతరం లభిస్తుంది. సరైన కక్ష్యలో ఉంచితే సోలార్ ప్యానెళ్లు భూమిపై కంటే 8 రెట్లు ఎక్కువ విద్యుత్‌ను ఉత్పత్తి చేయగలవు. అంతరిక్షంలో రాత్రి లేదా మేఘాలు ఉండవు కాబట్టి విద్యుత్ సరఫరా నిరంతరం ఉంటుంది కాబట్టి బ్యాటరీల అవసరం తగ్గుతుంది. ప్రపంచవ్యాప్తంగా చాట్‌బాట్‌లు, ఇమేజ్ జనరేటింగ్ టూల్స్, వీడియో ఎడిటింగ్ వంటి ఏఐ సేవలకు క...