Posts

Showing posts with the label Former Minister Harish Rao condemns Khammam demolitions

ఖమ్మం కూల్చివేతలను ఖండించిన మాజీ మంత్రి హరీశ్ రావు

Image
తె లంగాణలోని ఖమ్మం నగరం వెలుగుమట్ల వినోబా నగర్‌ కూల్చివేతలను మాజీ మంత్రి హరీశ్ రావు ఖండించారు. అప్పులు చేసి పేదలు నిర్మించుకున్న ఇళ్లను వేల మంది పోలీసుల పహారాలో కూల్చివేయడం అత్యంత హేయమైన చర్య అని ఈ రాక్షస కాండను తీవ్రంగా ఖండిస్తున్నాననన్నారు. ఈ మేరకు ఇవాళ ఓ ప్రకటన విడుదల చేసిన హరీశ్ రావు.. ఇది ప్రజాస్వామ్యమా? లేక పోలీస్ రాజ్యమా? అని ప్రశ్నించారు. నాలుగు జిల్లాల నుండి వేల మంది పోలీసులను మోహరించి, ఒక యుద్ధ వాతావరణాన్ని సృష్టించి ఇళ్లను కూల్చాల్సిన అవసరం ఏమొచ్చింది, పేద ప్రజలు మీకేమైనా తీవ్రవాదుల్లా కనిపిస్తున్నారా అని నిలదీశారు. పోలీసులను అడ్డం పెట్టుకుని మీడియాను రాకుండా అడ్డుకుంటున్నారంటేనే మీరు చేస్తున్న అరాచకం లోకానికి తెలియకూడదనే మీ భయం అర్థమవుతోందని చీకటి పనులు చేసేవారే మీడియాను చూసి భయపడతారన్నారు. మేము అధికారంలోకి వస్తే ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం అని నమ్మబలికిన రేవంత్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు.. నేడు ఉన్న ఇళ్లను కూలగొట్టి పేదలను నడిరోడ్డుపై నిలబెడుతున్నారని ధ్వజమెత్తారు. ఓటు వేసినందుకు మాకు తగిన శాస్తి జరిగింది అని బాధితులు రోదిస్తుంటే.. గుండె తరుక్కు పోతున్నదన్నారు. ఎంతో కష్టపడి, రూ...