Posts

Showing posts with the label FIR against Bhagirath

కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడిపై పొక్సో కేసు నమోదు : 'హనీట్రాప్' చేసి బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని పోలీసులను ఆశ్రయించిన మంత్రి కుమారుడు

Image
హై దరాబాద్‌లోని కొంపల్లికి చెందిన ఒక కుటుంబం తనను 'హనీట్రాప్' చేసి బ్లాక్‌మెయిల్ చేస్తోందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బందీ భగీరథ్ పోలీసులను ఆశ్రయించారు. అయితే, దీనికి ప్రతిగా సదరు బాలిక కుటుంబం కూడా భగీరథ్‌పై ఫోక్సో చట్టం కింద పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో కౌంటర్ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ పరిణామం ఇప్పుడు రాజకీయ మరియు సామాజిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. భగీరథ్ తన ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం ఒక ఉమ్మడి స్నేహితుడి ద్వారా తనకు ఆ బాలికతో పరిచయం ఏర్పడిందని, స్నేహం నెపంతో ఆ కుటుంబం తనను, తన స్నేహితులను వివిధ కుటుంబ వేడుకలకు, ఆధ్యాత్మిక యాత్రలకు ఆహ్వానించేవారని ఆయన తెలిపారు. అందరం కలిసి విజయవాడ, అరుణాచలం, తిరుమల వంటి పుణ్యక్షేత్రాలకు కూడా వెళ్లామని పేర్కొన్నారు. అయితే, కొంతకాలం తర్వాత వారి ప్రవర్తన మారిందని, ఆ బాలికను వివాహం చేసుకోవాలని ఆమె తల్లిదండ్రులు ఒత్తిడి చేయడం ప్రారంభించారని భగీరథ్ ఆరోపించారు. తాను వివాహానికి నిరాకరించడంతో, ఆ కుటుంబం తనపై అసత్య ఆరోపణలు చేస్తూ బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టిందని భగీరథ్ ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. "పెళ్లి చేసు...