Posts

Showing posts with the label Electronics Component Manufacturing Scheme

తమిళనాడులో 4,271 కోట్ల పెట్టుబడితో ఐదు యూనిట్లు ఏర్పాటు !

Image
దే శంలోని ఎలక్ట్రానిక్స్ తయారీ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పథకం ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్. దీని ద్వారా మేకిన్ ఇండియా ప్రోగ్రాం కి ఊతం ఇవ్వాలని నిర్ణయించారు. ఇది వివిధ రకాల ఎలక్ట్రానిక్స్ తయారీని ప్రోత్సహించడానికి, ఇతర దేశాల పైన ఆధార పడడాన్ని తగ్గించడానికి, మనదేశంలోని తయారీదారులకు ప్రోత్సాహకాలను అందించడానికి రూపొందించబడిన పథకం. ఈ పథకం ద్వారా దేశీయ తయారీని బలోపేతం చేయాలని కేంద్రం నిర్ణయించింది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రారంభించిన ఈ పథకంలో అనేక యూనిట్లను ఏర్పాటు చేయడానికి దరఖాస్తులు వచ్చాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా పెట్టుబడులు ఆకర్షించబడ్డాయి. ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కాంపోనెంట్ స్కీం కింద దేశంలోని మూడు రాష్ట్రాలలో 5,500 కోట్ల పెట్టుబడితో ఏడు ప్రాజెక్టుల ఏర్పాటుకు కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ ఆమోదముద్ర వేసింది. ఇదే విషయాన్ని ఆ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఈ ఏడు ప్రాజెక్టుల ద్వారా 5,100 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభిస్తాయని, పరోక్షంగా మరికొంతమందికి ఉద్యోగాలు ...