ఆంధ్రప్రదేశ్ లో ఒకేరోజు 13,326 గ్రామ సభలు !
ఆం ధ్రప్రదేశ్ లో ఆగస్టు 23న రికార్డు స్థాయిలో ఒకేరోజు 13,326 చోట్ల గ్రామ సభలు నిర్వహించారు. దీన్ని వరల్డ్ రికార్డ్స్ యూనియన్ గుర్తించింది. ఈ మేరకు రికార్డు ధృవపత్రాన్ని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు అందజేశారు. పంచాయతీరాజ్ మంత్రిగా పవన్ బాధ్యతలు చేపట్టిన వంద రోజుల్లోనే ప్రపంచ రికార్డు నమోదైంది. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ స్వపరిపాలన ఆకాంక్ష ప్రయాణంలో కొత్త మైలురాయి ఆనందంగా ఉందని అన్నారు. ఇందులో భాగస్వాములైన అధికారులు, స్థానిక సంస్థలు, ప్రతినిధులకు అభినందనలు తెలిపారు. గ్రామసభలో పాల్గొని దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.