ఆంధ్రప్రదేశ్ లో ఆగస్టు 23న రికార్డు స్థాయిలో ఒకేరోజు 13,326 చోట్ల గ్రామ సభలు నిర్వహించారు. దీన్ని వరల్డ్ రికార్డ్స్ యూనియన్ గుర్తించింది. ఈ మేరకు రికార్డు ధృవపత్రాన్ని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు అందజేశారు. పంచాయతీరాజ్ మంత్రిగా పవన్ బాధ్యతలు చేపట్టిన వంద రోజుల్లోనే ప్రపంచ రికార్డు నమోదైంది. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ స్వపరిపాలన ఆకాంక్ష ప్రయాణంలో కొత్త మైలురాయి ఆనందంగా ఉందని అన్నారు. ఇందులో భాగస్వాములైన అధికారులు, స్థానిక సంస్థలు, ప్రతినిధులకు అభినందనలు తెలిపారు. గ్రామసభలో పాల్గొని దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ లో ఒకేరోజు 13,326 గ్రామ సభలు !
September 16, 2024
0
Tags