గవర్నర్ వీకే సక్సేనా అపాయింట్‌మెంట్ కోరిన సీఎం కేజ్రీవాల్!
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, లెప్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా కలవడం కోసం అపాయింట్‌మెంట్ కోరారు. సీఎం కేజ్రీవాల్ రేపు తన పదవికి రాజీనామా చేయనున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ పేర్కొంది. "ముఖ్యమంత్రి మంగళవారం లెప్టినెంట్ గవర్నర్ సక్సేనా అపాయింట్‌మెంట్ కోరారు. ఆయన రాజీనామా చేసే అవకాశం ఉంది" అని పార్టీ సోమవారం తెలిపింది. రెండు రోజుల తర్వాత తన పదవికి రాజీనామా చేస్తానని సీఎం కేజ్రీవాల్ ఆదివారం ప్రకటించారు. సీఎం కేజ్రీవాల్ ఆదివారం ఆప్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ తాను సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రజలు తనకు నిజాయితీగా సర్టిఫికెట్ ఇచ్చే వరకూ సీఎం కుర్చీలో కూర్చోబోనని చెప్పారు. దేశ రాజధానిలో ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
Comments
Post a Comment