Posts

Showing posts with the label వచ్చే విద్యా సంవత్సరం నుంచి 'తల్లికి వందనం'

వచ్చే విద్యా సంవత్సరం నుంచి 'తల్లికి వందనం'

Image
ఆం ధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ముఖ్యమంత్రి  చంద్రబాబు నేతృత్వంలో జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కాగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో ‘తల్లికి వందనం’ పథకాన్ని అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించారు. ఈ పథకం ద్వారా ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15,000 నిధులు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. పథకానికి సంబంధించిన విధివిధానాలు త్వరలోనే ఖరారు చేయాలని ప్రభుత్వం ప్రకటించింది. ‘తల్లికి వందనం’ పథకం ద్వారా ఆర్థికంగా పేద కుటుంబాలకు పెద్ద రిలీఫ్ ఉంటుంది. ప్రతి విద్యార్థికి ఈ పథకం వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇంట్లో ఎంత మంది పిల్లలున్నా అందరికీ ఈ నిధులు ఇవ్వాలని నిర్ణయించారు. విద్యార్థుల విద్య కోసం ఈ నిధులను ఉపయోగించుకోవచ్చు. ఈ పథకం అమలు చేసే సందర్భంగా, రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థలు పేద కుటుంబాల ఆర్థిక స్థితిని మరింత బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ పథకం ద్వారా పిల్లలకు విద్యా వృద్ధి పథకాలను పూర్తి చేయడం, విద్యా కృత్యాలను ప్రోత్సహించడం ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. అలాగే గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం నదింపాలెం గ్రామంలో ఆర...