Posts

Showing posts with the label భారత మార్కెట్‌లోకి వస్తున్న తొలి ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్

హోండా ఫ్లెక్స్ ఫ్యూయల్‌ బైక్‌ లాంచ్ !

Image
హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) భారత మార్కెట్లో మొట్ట మొదటి ఫ్లెక్స్ ఫ్యుయల్ బైక్‌ను లాంచ్‌ చేసింది. 'CB300F ఫ్లెక్స్ ఫ్యూయల్' పేరుతో దీన్ని ఆవిష్కరించింది. 300 సీసీ సెగ్మెంట్‌లో భారత మార్కెట్‌లోకి వస్తున్న తొలి ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్ ఇదే కావడం విశేషం. అయితే, హోండా సంస్థ ఇలాంటి మెడళ్లను తయారు చేయడం ఇది మొదటి సారేమీ కాదు. గతంలో బ్రెజిల్‌ దేశంలో 70 లక్షల ఫ్లెక్స్ ఫ్యుయల్ బైక్‌లను విక్రయించింది. ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్ 85 శాతం ఇథనాల్, 15 శాతం గ్యాసోలిన్‌తో పనిచేస్తుంది. ఈ బైక్ రూ. 1.70 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) వద్ద అందుబాటులో ఉంది. హోండా ఫ్లెక్స్‌ ఫ్యూయల్ బైక్‌ మొత్తం రెండు కలర్‌ వేరియంట్లలో లభిస్తుంది. స్పోర్ట్స్‌ రెడ్‌, మ్యాట్‌ యాక్సిస్‌ గ్రే మెటాలిక్‌ అనే రెండు కలర్‌ కాంబినేషన్లలో అందుబాటులో ఉంటుంది. దీని బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయని కంపెనీ తెలిపింది. అక్టోబర్‌ చివరి వారం నుంచి హోండా బిగ్‌ వింగ్‌ డీలర్‌షిప్‌ సెంటర్లలో అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. హోండా ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ బైక్‌ను తీసుకురావడంపై కంపెనీ ఎండీ, సీఈవో సుత్సము ఒటాని హర్షం వ్యక్త...