Posts

Showing posts with the label పాకిస్తాన్‌

భారత శాశ్వత సభ్యత్వానికి మోకాలడ్డుతున్న చైనా, పాకిస్తాన్‌ !

Image
ప్ర స్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న పలు సవాళ్లను పరిష్కరించాలంటే ఐక్యరాజ్య సమితి  భద్రతా మండలిలో సంస్కరణలు అవసరమని భారత్‌ పునరుద్ఘాటించింది. ఈ సందర్భంగా న్యూఢిల్లీకి శాశ్వత సభ్యత్వం కల్పించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పింది. భద్రతా మండలిని విస్తరించాలని, అందులో ఆఫ్రికా, ఆసియా-పసిఫిక్‌ దేశాలకు సభ్యత్వం కల్పించాలని సూచించింది. అయితే, దీన్ని చైనా, పాకిస్తాన్‌ వ్యతిరేకించాయి. అంతర్జాతీయ శాంతిభద్రతల నిర్వహణ అంశంపై ఐరాస భద్రతా మండలిలో ఉన్నతస్థాయి చర్చ జరిగింది. ఇందులో జీ4 (భారత్‌, బ్రెజిల్‌, జపాన్‌, జర్మనీ) దేశాల తరఫున భారత ప్రతినిధి ఆర్‌.రవీంద్ర కీలక ప్రసంగం చేశారు. ''ఐరాస భద్రతా మండలిని 15 నుంచి 25-26కు పెంచాలి. మరో ఆరు శాశ్వత సభ్య దేశాలు, నాలుగు లేదా ఐదు తాత్కాలిక సభ్య దేశాలను మండలిలో చేర్చాలి. శాశ్వత సభ్యులుగా కొత్తగా చేర్చే ఆరింటిలో రెండు ఆఫ్రికా దేశాలు, మరో రెండు ఆసియా-పసిఫిక్‌ దేశాలు ఉండాలి. లాటిన్‌ అమెరికా/కరేబియా నుంచి ఒకటి.. పశ్చిమ యూరోపియన్‌ ప్రాంతం నుంచి ఒక దేశానికి శాశ్వత ప్రాతినిధ్యం కల్పించాలి. కొత్తగా చేర్చే శాశ్వత సభ్యులకు కూడా వీటో లాంటి అధికారాలు కల్పించాలి'' అన...