Posts

Showing posts with the label కోర్సులు పూర్తిచేసిన వారికి మంచి ఉద్యోగ అవకాశాలు

ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ మధ్య తేడా ?

Image
దే శంలోనే ప్రతిష్టాత్మక విద్యాసంస్థలుగా పేరొందిన ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీలో చదవాలనే కల చాలా మందికి ఉంటుంది. ఇక్కడ కోర్సులు పూర్తిచేసిన వారికి మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అయితే, ఈ విద్యాసంస్థల్లో సీటు పొందడం అంత సులభమేమీ కాదు. జేఈఈ వంటి అత్యంత కఠినమైన పరీక్షలో మంచి స్కోరు సాధించాల్సి ఉంటుంది.  ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) : ఐఐటీలు దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక ఇంజినీరింగ్ కళాశాలలు. ఇక్కడ చదవాలని చాలామంది కలలు కంటారు. అయితే, జేఈఈ అడ్వాన్సుడ్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారికే అడ్మిషన్ దక్కుతుంది. ఐఐటీ జేఈఈ దేశంలోఅత్యంత కఠినమైన ఎంట్రెన్స్ టెస్ట్ గా పేరొందింది. ఈ విద్యాసంస్థలు యూజీ, పీజీ, డాక్టోరల్ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఐఐటీలు ఇంజినీరింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సులను అందిస్తున్నాయి. బీటెక్ ఫీజు సంవత్సరానికి రూ. 2.2 లక్షల నుండి రూ. 3.2 లక్షల మధ్య ఉంటుంది. హాస్టల్, మెస్ ఛార్జీల కోసం అధనంగా రూ. 1.5 లక్షల నుండి రూ. 2 లక్షల వరకు ఖర్చవుతుంది. ఇలా లెక్కేసుకుంటే నాలుగేళ్ల బీటెక్ కోర్సుకు మొత్తం రూ. 10 లక్షల నుంచి రూ. 14 లక్షల ఖర్చవుతుం...