Posts

Showing posts with the label ఆర్ధిక మాంద్యం వేళ ఉద్యోగల కోత కొనసాగుతుంది

వోడాఫోన్‌లో భారీ ఉద్యోగాల కోత !

Image
వొడాఫోన్ వచ్చే మూడేళ్లలో 11 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్నట్లు  సీఈఓ మార్గరీటా డెల్లా ప్రకటించారు.  సంస్థ ఖర్చులను ఆదా చేసేందుకు వర్క్‌ఫోర్స్‌ను తగ్గించాలని కంపెనీ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఇప్పటికే పలు కంపెనీలు చాలామందిని ఇంటిని పంపించాయి. తాజాగా వోడాఫోన్ కూడా భారీగా ఉద్యోగుల కోతకు ప్లాన్ వేసింది. ఆర్ధిక మాంద్యం వేళ ఉద్యోగల కోత కొనసాగుతుంది. ఈ మేరకు సీఈఓ మార్గరీటా డెల్లా ప్రకటించారు. గత నెలలో సీఈఓగా డెల్లా నియమితులయ్యారు. అప్పటి నుంచి అనేక చర్యలను తీసుకున్నారు. ఉద్యోగుల పనితీరు, పలు మార్పులపై కీలక సూచనలు చేశారు. అందులో భాగంగానే ఉద్యోగాల కోత విధించనున్నారు. ఇప్పుడు వోడాఫోన్‌ను మరింత స్థిరమైన భవిష్యత్తు వైపు నడిపించేందుకు ప్రణాళికలు వేస్తోందని సీఈఓ తెలిపారు. కొత్త ఆర్థిక సంవత్సరంలో ఖర్చులను భారీగా తగ్గించే ప్రణాళికల్లో భాగంగానే ఉద్యోగాల కోత విధించనున్నట్టు చెప్పారు. అంతకుముందు నవంబర్ 2022లో, వోడాఫోన్ వార్షిక లాభాల అంచనాను తగ్గించింది.ఆ తర్వాత ఇంధన బిల్లులు, ద్రవ్యోల్బణాన్ని పరిష్కరించేందుకు ఉద్యోగాల కోతలతో సహా ఖర్చు తగ్గించే ప్రణాళికను ప్రకటించింది. నాలుగేళ్ల కాలంలో మార...