మద్యం సేవిస్తే ఎలక్ట్రిక్ బైక్ స్టార్ట్ కాదు !
ఉ త్తరప్రదేశ్, అలహాబాద్ లోని మోతీలాల్ నెహ్రూ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజినీరింగ్ విద్యార్థులు, సొసైటీ ఆఫ్ ఆటోమోటివ్ ఇంజనీర్స్ క్లబ్‌తో కలిసి అత్యాధునిక టెక్నాలజీతో కూడిన ఎలక్ట్రిక్ బైకును డిజైన్ చేశారు. మెకానికల్ ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు భోపాల్‌లో జరిగిన ప్రతిష్టాత్మక పోటీలో భాగంగా అత్యంత భద్రతతో కూడిన ఈ ఎలక్ట్రిక్ బైకును అభివృద్ధి చేశారు. ఈ పోటీలో ఎలక్ట్రిక్ బైకు బెస్ట్ డిజైన్‌తో ఫ్యూచర్ అవార్డులను గెలుచుకుంది. ఈ బైకును మద్యం సేవించి నడుపుతానంటే స్టార్ట్ కాదు. ఒకవేళ స్టార్ట్ చేసినా ఆటోమాటిక్‌గా ఆఫ్ అయిపోతుంది. ఎందుకంటే.. ఈ బైక్‌లో ఆల్కహాల్ డిటెక్షన్ సిస్టమ్స్. స్మోక్ సెన్సార్లు వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇవి ముందుగానే ప్రమాదాలను హెచ్చరిస్తాయి. హిల్-అసిస్ట్ ఫీచర్ కూడా ఉంది. తద్వారా ప్రమాద సమయాల్లో ఎమర్జెన్సీ సర్వీసులను పొందవచ్చు. ఈ వినూత్న ఎలక్ట్రిక్ బైకు గంటకు 70 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందుకోగలదు. అంతేకాదు.. కేవలం 4 గంటల ఛార్జ్‌తో 60 కిలోమీటర్లు దూసుకుపోగలదు. మెరుగైన భద్రత కోసం ఆల్కహాల్ డిటెక్షన్ సిస్టమ్‌లు కాకుండా స్మోక్ సెన్సార్లు, యాంటీ-థెఫ...