ఇద్దరు ఎమ్మెల్సీలపై అసెంబ్లీలో తీర్మానం పెట్టిన మంత్రి దామోదర : కేసీఆర్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఈ తీర్మానంలో డిమాండ్

బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిపై సభ తరఫున కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ మంత్రి దామోదర రాజనర్సింహ కీలక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అసెంబ్లీ ఆవరణలో బీఆర్ఎస్ సభ్యులు, నేతలు వ్యవహరించిన తీరుపై విపక్ష నేత కేసీఆర్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఈ తీర్మానంలో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సభలో మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ ఎస్సీల చరిత్ర అనేది కేవలం ఒక వర్గానికి సంబంధించినది కాదని, అది జాతి ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమని, కానీ రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలను, అత్యున్నత పదవులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. స్పీకర్ స్థానం ఏ ఒక్క కులానికో, మతానికో చెందింది కాదని, అలాంటి పీఠంపై కూర్చున్న వ్యక్తిని అవమానించడం క్షమించరాని నేరమని మండిపడ్డారు. అధికారంలో లేకపోయినా బీఆర్ఎస్ నేతల అహంకారం మాత్రం తగ్గలేదని ధ్వజమెత్తూతూ, ప్రజా జీవితంలో ఉన్నవారు ఎంతో బాధ్యతగా నడుచుకోవాలని హితవు పలికారు. మంత్రి దామోదర ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పూర్తిగా బలపరుస్తూ సభలో మాట్లాడారు. రాజ్యాంగ వ్యవస్థల పరిరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం తరఫున కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. అనంతరం సభ తీర్మానానికి ఏకగ్రీవంగా ఆమోదం తెలపింది. దీంతో ఎమ్మెల్సీలపై చర్యలకు సంబంధించిన అధికారిక తీర్మానం కాపీని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి పంపనున్నారు. 

Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం