మహారాష్ట్రలో రికార్డు స్థాయి వర్షామహారాష్ట్ర లో రికార్డు స్థాయిలో వర్షాలు : తహిని ఘాట్ లో సరికొత్త రికార్డులు : తంహిని ఘాట్ లో సరికొత్త రికార్డు

హారాష్ట్రలో రుతుపవనాల ప్రభావంతో రికార్డు స్థాయి వర్షాలు కురుస్తున్నాయి.  పుణే జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన తహిని ఘాట్ వర్షపాతంలో సరికొత్త చరిత్ర సృష్టించింది.  ఇక్కడ 72 గంటల వ్యవధిలోనే 1,635 మిల్లీమీటర్ల అత్యంత భారీ వర్షపాతం నమోదైంది. జూలై 6, 7, 8 తేదీల్లో వరుసగా మూడు రోజుల పాటు ప్రతిరోజూ 500 మిల్లీమీటర్లకు పైగా కుంభవృష్టి కురిసి పర్యావరణ శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరిచింది. పశ్చిమ కనుమలలోని ఈ ప్రాంతం అకస్మాత్తుగా చేరాపుంజిని తలపించేలా మారడంతో స్థానిక నదులు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సముద్ర మట్టానికి సుమారు 634 మీటర్ల ఎత్తులో ఉండే తంహిని ఘాట్ ప్రాంతానికి పర్యావరణ పరంగా ఎంతో విశిష్టత ఉంది. ఇది ‘యునెస్కో’ ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన పశ్చిమ కనుమల జీవవైవిధ్యంలో ఒక భాగం. సుమారు 15 కిలోమీటర్ల పొడవునా విస్తరించి ఉండే ఈ ఘాట్ రోడ్డు మార్గంలో ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వందలాది తాత్కాలిక జలపాతాలు, నిండుగా ప్రవహిస్తున్న సరస్సులు ప్రకృతి ప్రేమికులను ఎంతగానో కనువిందు చేస్తున్నాయి. అయితే, వర్షం రికార్డు స్థాయిలో పడటంతో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని, ఘాట్ రోడ్డు ప్రయాణాల్లో పర్యాటకులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని స్థానిక యంత్రాంగం హెచ్చరికలు జారీ చేసింది.

Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం