ఓటు చోరీ చేయలేక సీటు చోరీ చేశారు : మీడియా చిట్‌చాట్‌లో సీఎం రేవంత్ రెడ్డి
ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ విషయంలో బీజేపీ, బీఆర్‌ఎస్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. బీజేపీ కిమ్ జాంగ్‌లా ప్రవర్తిస్తుందని మండిపడ్డారు. ఉత్తర కొరియా తరహాలో ఏక పార్టీ ఎన్నికలు పెడుతున్నారు. ప్రజాస్వామ్య విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఓటు చోరీ చేయలేక సీటు చోరీ చేశారు. రిటర్నింగ్ అధికారి తప్పు చేశారు. లేని బలంతో మూడో అభ్యర్థిని పెట్టడం అంటేనే బీజేపీ ముందుగానే కుట్రలకు తెరలేపిందనేది అర్థమవుతుంది. బిజెపి కుట్రను డైవర్ట్ చేసేందుకు, కాంగ్రెస్ కోవర్టులని దుష్ప్రచారం చేస్తున్నారు' అని విమర్శించారు.
Comments
Post a Comment